: మూఢనమ్మకాల ముఖ్యమంత్రి కేసీఆర్: పొన్నాల లక్ష్మయ్య
దేశ చరిత్రలో మూఢనమ్మకాలు కలిగిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ నిలిచిపోతారని టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య పేర్కొన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, మూఢనమ్మకాల కారణంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సచివాలయంలోని తన ఛాంబర్ లొకి వెళ్లేందుకు నాలుగు సార్లు రూటుమార్చారని అన్నారు. కేసీఆర్ ను భయంకరమైన అభద్రతాభావం వెంటాడుతోందని ఆయన చెప్పారు. కేసీఆర్ ది అహంకార పాలన అని విమర్శించిన ఆయన, వ్యక్తిగత మొక్కులు, వాస్తుదోషం అంటూ నమ్మకాల కోసం ప్రజాధనం ఎలా ఖర్చుచేస్తారని నిలదీశారు. పాలనపై పెరుగుతున్న విమర్శల వల్ల కేసీఆర్ ను భయంకరమైన అభద్రతా భావం వెంటాడుతోందని పొన్నాల పేర్కొన్నారు.