: మరోసారి పునరావృతమైన 2009... దేశవ్యాప్తంగా స్వైన్ ఫ్లూ


2009 మరోసారి పునరావృతమయ్యేలా కనిపిస్తోంది. 2009లో దేశాన్ని భయాందోళనలకు గురి చేసిన స్వైన్ ఫ్లూ మరోసారి దేశంపై పంజా విసురుతోంది. తెలంగాణలో ప్రారంభమైన స్వైన్ ఫ్లూ సంక్రాంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు ప్రయాణించింది. తరువాత రాజస్థాన్ లో స్వైన్ ఫ్లూ కేసు నమోదైంది. తరువాత యూపీ రాజధాని లక్నోలో 25 మందికి స్వైన్ ఫ్లూ నిర్థారణ అయినట్టు తెలుస్తోంది. తాజాగా గోవాలో తొలి స్వైన్ ఫ్లూ మరణం సంభవించింది. దీంతో స్వైన్ ఫ్లూ పట్ల ఇతర రాష్ట్రాలన్నీ అప్రమత్తమయ్యాయి.

  • Loading...

More Telugu News