: మరోసారి తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు
అంతర్జాతీయ మార్కెట్లో క్రూడాయిల్ ధరలు పతనమవుతుండటంతో, మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. మోదీ ప్రధాని అయిన తర్వాత ఇప్పటికే పలుమార్లు తగ్గిన ధరలు, ఈ రోజు మరోసారి తగ్గాయి. లీటర్ పెట్రోల్ ధర రూ. 2.42 తగ్గగా, లీటర్ డీజిల్ ధర రూ. 2.25 తగ్గింది. తగ్గిన ధరలు ఈ అర్ధరాత్రి నుంచి అమల్లోకి వస్తాయి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం ఇది పదోసారి.