: బస్సుపై పెట్రోల్ బాంబు విసిరిన నిరసనకారులు... నిద్రిస్తున్న ఏడుగురు సజీవదహనం


బంగ్లాదేశ్‌లో తాజాగా ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు చేపట్టిన నిరసన ప్రదర్శనలో దారుణం జరిగింది. ఢాకా నుంచి కాక్స్‌ బజార్ వైపు వెళుతున్న బస్సుపై ఈ తెల్లవారుజామున 4 గంటల సమయంలో కొందరు నిరసనకారులు పెట్రోల్ బాంబు విసిరారు. దీంతో, బస్సుకు మంటలు అంటుకోగా, దానిలో నిద్రిస్తున్న ఏడుగురు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రులకు తరలించినట్టు అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనకు, నిరసనలకూ సంబంధం లేదని విపక్ష నేత ఖలీదా జియా వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News