: మేనిఫెస్టోలో సెకండ్ పార్ట్ విడుదల చేసిన కాంగ్రెస్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకుగాను కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో రెండవభాగాన్ని ఈరోజు విడుదల చేసింది. అన్ని మతాలను సమానంగా చూస్తామని ఈ సందర్భంగా హామీ ఇచ్చింది. ప్రతి ఒక్క మతానికి ప్రత్యేక గుర్తింపు ఉంటుంది అని మేనిఫెస్టోలో పేర్కొంది. ఢిల్లీలో ఆ పార్టీ ఎన్నికల ప్రచార ఇన్ ఛార్జ్ అజయ్ మాకెన్ పలువురు ఈ మేనిఫెస్టోను విడుదల చేశారు. వికలాంగులకు అవసరమైన చర్యలు, మురికివాడల్లో నివసిస్తున్న వారికి షెల్టర్ ఏర్పాటు చేయనున్న విషయాన్ని, ఢిల్లీని భిక్షగాళ్లులేని నగరంగా మారుస్తామన్న విషయాన్ని అందులో పేర్కొంది. ఇంకా పలు ప్రతిపాదనలతో పాటు ఢిల్లీ మెట్రోను విస్తరిస్తామని కూడా కాంగ్రెస్ చెప్పింది.

  • Loading...

More Telugu News