: హోటల్ లో విగతజీవులుగా 31 ఏళ్ల ఎన్నారై, 29 ఏళ్ల ఇండోనేసియన్ మహిళ
సింగపూర్ లోని గెలాంగ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో ఇద్దరు విదేశీయులు విగతజీవులుగా కనిపించడం కలకలం రేపుతోంది. వారాంతంలో సింగపూర్ లోని గెలాంగ్ ప్రాంతం విదేశీయులతో బిజీగా దర్శనమిస్తుంది. వారాంతం ముగియడంతో ఈ ప్రాంతం వెలవెలబోతుంది. కాగా, ఓ హోటల్ గదిలో 31 ఏళ్ల చిన్నస్వామి భాస్కర్ అనే ఎన్నారై, 29 ఏళ్ల ఇండోనేసియన్ మహిళ రులీ విద్యావతి మృతదేహాలు లభ్యమయ్యాయి. చిన్నస్వామి భాస్కర్ నిర్మాణ సంస్థలో విధులు నిర్వర్తిస్తుండగా, విద్యావతి వంట మనిషిగా పనిచేస్తోంది. ఆమెకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కాగా, వీరి మరణాలు సహజమైనవి కాదని, హత్యలు జరిగినట్టు అనుమానిస్తున్నామని సింగపూర్ పోలీసులు తెలిపారు. ఇద్దరి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిందని, మృతదేహాలను వారి స్వస్థలాలకు పంపేందుకు చర్యలు తీసుకున్నట్టు అధికారులు వెల్లడించారు.