: పిజ్జా, బర్గర్లను వెనక్కునెట్టిన సంప్రదాయ తినుబండారాలు... స్నాక్ మార్కెట్లో హల్దీరామ్స్ హవా!


మల్టీ నేషనల్ కంపెనీలుగా భారత్ లో అడుగుపెట్టి పాశ్చాత్య ఆహార పదార్థాలను పరిచయం చేసిన మెక్ డొనాల్డ్స్, డోమినోస్ సంస్థలు ఎన్ని లాభాలను మూటగట్టుకున్నా సంప్రదాయ తినుబండారాలకు ఆదరణ తగ్గలేదు. భారత స్నాక్ మార్కెట్లో మెక్ డొనాల్డ్స్, డోమినోస్ సంస్థల మొత్తం ఆదాయానికి మించిన ఆదాయాన్ని హల్దీరామ్స్ నమోదు చేసి సత్తా చాటింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో మెక్ డొనాల్డ్స్ రూ.1,390 కోట్లు, డోమినోస్ రూ.1,733 కోట్ల రూపాయల ఆదాయం పొందగా, హల్దీరామ్స్ ఏకంగా రూ.3,500 కోట్ల ఆదాయాన్ని నమోదు చేసింది. ఇక, 'మ్యాగీ' రూ.1,200 ఆదాయం కళ్లజూడగా, అందుకు మూడు రెట్లు హల్దీరామ్స్ ఆర్జించడం విశేషం. భారత్ లో సంప్రదాయ తినుబండారాల మార్కెట్ విలువ రూ.5,500 కోట్లుగా ఉండగా, అందులో 40 శాతం వాటా హల్దీరామ్స్ సంస్థదే.

  • Loading...

More Telugu News