: ‘సబర్మతి’ ఆతిథ్యం మరువలేనిది: సుష్మా స్వరాజ్ తో చైనా అధ్యక్షుడు
చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత పర్యటన ముగిసి దాదాపు నాలుగు నెలలు పూర్తి కావస్తోంది. అయినా, నాటి పర్యటనను ఆయన ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. గుజరాత్ వాణిజ్య రాజధాని అహ్మదాబాదులో సెప్టెంబర్ 17న సబర్మతి నదీతీరాన ప్రధాని నరేంద్ర మోదీ, జిన్ పింగ్ కు ప్రత్యేక విందు ఇచ్చారు. నాటి తీపి జ్ఞాపకాలను నేటికీ జిన్ పింగ్ నెమరువేసుకుంటూనే ఉన్నారు. ప్రస్తుతం చైనా పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ నిన్న జిన్ పింగ్ తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నాటి తన భారత పర్యటనను మరోమారు నెమరువేసుకున్న జిన్ పింగ్, ‘‘గుజరాత్ తీపి జ్ఞాపకాలు గుర్తుండిపోతాయి’’ అని వ్యాఖ్యానించారు. నాటి తన భారత పర్యటన ఇరు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసిందని కూడా ఆయన అన్నారు.