: బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కు సమన్లు


బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కు ముంబయి జేజే మార్గ్ పోలీసులు సమన్లు పంపారు. జైల్లో ఉన్న గ్యాంగ్ స్టర్ అరుణ్ గావ్లీని జేజే ఆసుపత్రిలో ఈ నటుడు కలిసినట్టు పోలీస్ స్టేషన్ కు సమాచారం అందింది. ఈ క్రమంలోనే అతనికి సమన్లు ఇచ్చారు. రాంపాల్ 'డాడీ' అనే చిత్రంలో నటిస్తున్నాడు. అందులో గావ్లీ పాత్రను పోషిస్తున్నాడు. ఇందుకోసమే గతేడాది డిసెంబర్ 29న ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగంలో గ్యాంగ్ స్టర్ తో రాంపాల్ గంటసేపు మాట్లాడినట్టు తెలిసింది. 2008లో కార్పొరేటర్ కమలాకర్ జంషాండేకర్ హత్య కేసులో గావ్లీ జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. ఎప్పటిలాగే చెకప్ కోసం ఆసుపత్రికి తీసుకొచ్చినప్పుడు రాంపాల్ కలిశాడట. దానికోసం కోర్టు నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. దాంతో ఇప్పుడీ నటుడు సమస్యల్లో పడ్డాడు. మరోవైపు, వారిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు అక్కడే ఉన్న నవీ ముంబయి తలోజా జైలు పోలీసు బృందంపై అంతర్గత దర్యాప్తుకు ఆదేశాలు జారీ అయ్యాయి.

  • Loading...

More Telugu News