: చంద్రబాబు, వెంకయ్యలను 'నాయుడు బ్రదర్స్'గా అభివర్ణించిన కాంగ్రెస్
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడులపై కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై 'నాయుడు బ్రదర్స్' ఎందుకు మాట్లాడటం లేదని కాంగ్రెస్ నేతలు రఘువీరారెడ్డి, పళ్లం రాజు నిలదీశారు. దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేస్తూ, ఓ కరపత్రాన్ని కూడా విడుదల చేశారు. నెలకోసారి ఢిల్లీకి వెళ్లి, కేంద్ర మంత్రులందరినీ కలిశానంటూ ఫొటోలు దిగే చంద్రబాబు... ప్రత్యేక హోదా గురించి ఏం చేశారో తెల్ల కాగితంపై వివరిస్తారా? అంటూ ఎద్దేవా చేశారు. ప్రత్యేక హోదాకు సంబంధించి కోటి సంతకాల ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నట్టు వెల్లడించారు. టీడీపీ, బీజేపీలు రెండూ జంట తోడేళ్ల మాదిరి జనాలను వంచిస్తున్నాయని ఆరోపించారు.