: ఒత్తిడిలో టీ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య... నేడు కీలక నిర్ణయమని ప్రచారం!
తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయన నేడు తన రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయం ప్రకటించనున్నారన్న వార్తలు వెలువడుతున్నాయి. వీటికి బలం చేకూరుస్తూ ఆయన 11 గంటలకు మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసిన తర్వాత తొలిసారిగా నిన్న సీఎం కేసీఆర్ ను కలిసిన ఆయన దాదాపు 20 నిమిషాల పాటు తన వాదన వినిపించే యత్నం చేశారు. అయితే వాటిని అంతగా పట్టించుకోని సీఎం కేసీఆర్, 'కాస్త ఓపిక పట్టు.. ఐదారు నెలలు గడిస్తే మరో పదవిస్తా'నంటూ చేసిన సూచనను కూడా రాజయ్య తిరస్కరించారని సమాచారం. ఈ నేపథ్యంలో మరికొద్దిసేపట్లో ఆయన నిర్వహించనున్న మీడియా సమావేశం ఉత్కంఠ రేపుతోంది.