: పార్టీ పటిష్ఠతపై కేసీఆర్... పెట్టుబడుల కోసం కేటీఆర్: నేడు బిజీబిజీగా తండ్రీకొడుకులు!
తెలంగాణ సీఎం కేసీఆర్ గడచిన ఎనిమిది నెలలుగా పార్టీ వ్యవహారాలపై దృష్టి సారించిన సందర్భాలు అతి తక్కువేనని చెప్పాలి. కొత్త రాష్ట్రంలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఆయన... పాలనపైనే దృష్టి కేంద్రీకరించారు. తాజాగా ఆయన పార్టీపైనా దృష్టి సారించేందుకు సిద్ధమయ్యారు. నేడు జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి ఆయన హాజురుకానున్నారు. సమావేశంలో పూర్తి స్థాయిలో పాలుపంచుకుంటూనే కీలక ప్రసంగం చేయనున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులను రాబట్టేందుకు ఆయన తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు ముంబై పయనమవుతున్నారు. ఐటీ శాఖ ఉన్నతాధికారులతో కలిసి ముంబై విమానం ఎక్కనున్న కేటీఆర్, టాటా గ్రూపు చైర్మన్ సైరస్ మిస్త్రీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులు రావడం ఖాయమని ఉన్నతాధికారులు చెబుతున్నారు.