: 70 వేల మంది భారతీయుల పర్యటనే లక్ష్యం
ఈ ఏడాది భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ ప్రణాళికలు రచిస్తోంది. ప్రతి ఏటా ఫిలిప్పీన్స్ ను భారతీయులు భారీగానే సందర్శిస్తుంటారు. 2013లో 52 వేల మంది భారతీయులు ఫిలిప్పీన్స్ ను సందర్శంచారని ఆ దేశ పర్యాటక శాఖ తెలిపింది. ఈ ఏడాది 70 వేల మంది భారతీయ పర్యాటకులను ఆకర్షించడమే లక్ష్యంగా ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ నిర్ణయించింది. భారతీయ పర్యాటకుల కోసం ప్రత్యక ప్యాకేజీలు సిద్ధం చేస్తున్నట్టు ఫిలిప్పీన్స్ పర్యాటక శాఖ ప్రధానాధికారి గ్లెన్ అగస్టీన్ తెలిపారు.