: దోషం సచివాలయానికి కాదు... కేసీఆర్ కే!: జీవన్ రెడ్డి
టీఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే, సీనియర్ నేత జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ సచివాలయాన్ని ఎర్రగడ్డలోని చెస్ట్ ఆసుపత్రికి తరలించాలన్న కేసీఆర్ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు సంబంధించిన తొలి చర్చ సచివాలయంలోనే జరిగిందన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. వాస్తు దోషం ఉన్నది సచివాలయానికి కాదని... కేసీఆర్ కే నని ఎద్దేవా చేశారు. ఎనిమిది నెలల పాలనలో ఒక్క పేదవాడికి కూడా ఇంటిని నిర్మించలేని ప్రభుత్వం, కొత్త సచివాలయం అంటూ పరుగులు పెట్టడం దారుణమని అన్నారు. కేసీఆర్ వన్నీ వట్టి మాటలేనని... చేతల్లో మాత్రం ఏమీ ఉండదని సెటైర్ విసిరారు.