: సీఎం కేసీఆర్ ను కలసిన రాజయ్య
ముఖ్యమంత్రి కేసీఆర్ ను క్యాంప్ కార్యాలయంలో మాజీ ఉపముఖ్యమంత్రి రాజయ్య కలిశారు. బర్తరఫ్ అయిన తరువాత తొలిసారి ఆయన సీఎంను కలిశారు. అవినీతి ఆరోపణలకు తోడు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా స్వైన్ ఫ్లూపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారంటూ అకస్మాత్తుగా రాజయ్యను పదవి నుంచి తొలగించిన సంగతి విదితమే. ఆ స్థానంలో ఎంపీ కడియం శ్రీహరిని ఉపముఖ్యమంత్రిగా కేసీఆర్ నియమించారు. దాంతో, ప్రతిపక్షాల నుంచి తెంగాణ సీఎం తీవ్ర ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు.