: ఆ ఇంటి వెడల్పు 48 అంగుళాలేనట!
ఇల్లు అంటే విశాలంగా ఉండాలి ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. విశాలమైన బెడ్రూం, అంతకంటే విశాలమైన లివింగ్ రూం, అన్ని సౌకర్యాలున్న పెద్ద వంటగది... ఎవరైనా ఇలాంటిల్లు కోరుకుంటారు. కానీ, ఇజ్రాయెల్ కు చెందిన రచయిత, సినీ దర్శకుడు ఎట్గర్ కెరెట్ ముచ్చటపడి మరీ జీరోసైజ్ ఇంటిని కట్టించుకున్నాడు. కేవలం 48 అంగుళాల పరిధిలో ఈ ఇల్లు రూపుదిద్దుకోవడం విశేషం. ఈ రోజుల్లో ఇల్లు కొనాలంటే లక్షలు చెల్లించాలి. దేశ రాజధానుల్లాంటి మహానగరాల్లో అయితే గజం స్థలానికే లక్షలు చెల్లించాలి. అలాంటి చోట్ల పరిష్కార మార్గంగా ఈ ఇల్లు కనిపిస్తోంది. పోలండ్ రాజధానిలోని వార్సాలో ఇజ్రాయిెల్ దర్శకుడు ఆరునెలలు ఉండాల్సి ఉంది. దీంతో ఓ ఇల్లు నిర్మించుకోవాలని భావించాడు. దీంతో, రెండు పెద్ద భవనాల మధ్య ఉన్న ఖాళీ స్థలంలో ఇల్లు నిర్మించుకోవాలని భావించి, వాటి యజమానుల అనుమతితో, పోలండ్ ఆర్ట్ ఫౌండ్ సహకారంతో జాకబ్ సెజెస్నీ అనే ఆర్కెటిక్ట్ ఈ ఇంటికి రూపకల్పన చేశారు. దీంట్లో సింగిల్ బెడ్ రూం, కిచెన్, డైనింగ్ రూం, బాత్ రూం వంటివి ఉండడం విశేషం, అయితే రెండు అంతస్తులు కలిగిన ఈ ఇంట్లో రెండవ అంతస్తుకెళ్లాంటే మాత్రం నిచ్చెన ఉపయోగించాల్సిందే. ప్రపంచంలో అత్యంత సన్నని ఇల్లు ఇదే. అల్ట్రా మోడ్రన్ ఇల్లుగా ఇది గుర్తింపు సంపాదించుకుంది.