: మహిళలపై వేధింపులు అడ్డుకున్న ఫలితం... మరణం!


మహిళల్ని వేధింపులకు గురి చేసే ఆకతాయిల్ని అడ్డుకున్నందుకు ఓ యువకుడు బలైపోయాడు. సాధారణంగా ఆకతాయిలు గుంపులుగా ఉండి వేధింపులకు పాల్పడుతుంటారు. ఉత్సవాలు, కూడళ్లలో పనీ పాటా లేకుండా వీరు తమ వికృతచేష్టలు, కామెంట్లతో మహిళల్ని ఇబ్బందుల పాలు చేస్తారు. ఒక్కరుగా ఉంటే ఇలాంటివి చేసేందుకు వెనుకాడతారు. కోల్ కతాలోని హౌరాలో స్థానిక ఉత్సవాల్లో భాగంగా హుగ్లీ నదిలో గణేష్ నిమజ్జనం జరిగింది. ఈ సందర్భంగా తాగిన మైకంలో కొంతమంది యువకులు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. వీరిని ఆరూప్ భండారీ (24) అనే యువకుడు అడ్డుకున్నాడు. దీంతో కక్ష పెంచుకున్న ఆకతాయిలు, ఇంటికి వెళ్తున్న భండారీపై ఇనుపరాడ్లతో దాడిచేశారు. తీవ్రంగా గాయపడిన అతడిని సమీప ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. కోమాలోకి వెళ్లిపోయిన భండారీ, మృతి చెందాడు. తొలుత కేసు నమోదు చేసేందుకు నిరాకరించిన పోలీసులు, స్థానికులు పోలీస్ స్టేషన్ ను ముట్టడించడంతో కేసు నమోదు చేశారు.

  • Loading...

More Telugu News