: మహారాష్ట్ర ప్లేయర్ హఠాన్మరణం... జాతీయ క్రీడల్లో విషాదం
కేరళలో జరుగుతున్న జాతీయ క్రీడల్లో విషాద ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్ర క్రీడాకారుడు మయూరిష్ పవార్ (21) హఠాన్మరణం చెందాడు. నెట్ బాల్ జట్టులో సభ్యుడైన మయూరిష్ కార్డియాక్ అరెస్ట్ కారణంగా ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర, చండీగఢ్ జట్ల మధ్య మ్యాచ్ ముగిసిన వెంటనే ఈ క్రీడాకారుడు కుప్పకూలిపోయాడు. దీంతో, అధికారులు అతడిని వెంటనే తిరువనంతపురంలోని సిటీ హాస్పటల్ కు తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే చనిపోయాడని డాక్టర్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సంబంధీకులకు అప్పగిస్తామని కేరళ క్రీడల శాఖ మంత్రి తెలిపారు.