: కిరణ్ బేడీ అంటే ఇప్పటికీ ఇష్టమే... కానీ, అయ్యో పాపం అనిపిస్తోంది: కేజ్రీవాల్


"కిరణ్ బేడీ చాలా మంచి మహిళ. ఆమె అంటే నాకు ఇప్పటికీ ఇష్టమే. కానీ, ఆమెను చూస్తే 'అయ్యో పాపం' అనిపిస్తోంది. బీజేపీ ఆమె నోరు నొక్కేసింది. మీడియాతో మాట్లాడకుండా ఆంక్షలు విధించింది" అని ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుత ఎన్నికల ప్రచారం వ్యక్తిగత ఆరోపణలే లక్ష్యంగా సాగుతోందని, బీజేపీ నేతలు తనతో పాటు తన కుటుంబ సభ్యులనూ వదలడం లేదని ఒక టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేజ్రీ ఆరోపించారు. కిరణ్ బేడీ తనతో బహిరంగ చర్చకు రావాలని కోరిన కేజ్రీ, అందుకు సంధాన కర్తగా బర్ఖా దత్ వ్యవహరించాలని సూచించారు. తానేమీ అనాగరికుడిని కాదని ఆమెకు తెలుసునని అన్నారు. తానెన్నడూ ఎవరిమీదా వ్యక్తిగత ఆరోపణలు చేయలేదని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News