: ఆస్ట్రేలియా కోచ్ గా జస్టిన్ లాంగర్ బెస్ట్: లీమన్
ప్రస్తుతం పశ్చిమ ఆస్ట్రేలియా క్రికెట్ కోచ్ గా ఉన్న జస్టిన్ లాంగర్ పై ఆసీస్ కోచ్ డారెన్ లీమన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆసీస్ కోచ్ గా బాధ్యతలు స్వీకరించడానికి లాంగర్ కు అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. ఇప్పటికే కోచ్ గా తానేమిటో లాంగర్ నిరూపించుకున్నాడని చెప్పాడు. తన తర్వాత ఆసీస్ కోచ్ గా లాంగర్ వస్తే జట్టుకు మేలు జరుగుతుందని భావిస్తున్నట్టు తెలిపాడు. 2017 వరకు ఆసీస్ కోచ్ గా లీమన్ వ్యవహరిస్తాడు. ఈ క్రమంలో, లాంగర్ పేరును లీమన్ తెర మీదకు తీసుకువచ్చాడు. 2009లో ఆసీస్ బ్యాటింగ్ కోచ్ గా కూడా లాంగర్ పని చేశాడు.