: పేరు మార్చుకున్న కిరణ్ బేడీ!
ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీ తన పేరును 'వికాస్ బేడీ'గా మార్చుకున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. "యమునా నదిని ప్రక్షాళన చేసే విషయంలో హర్యానా సీఎంను కలిసినప్పుడు నా కొత్త పేరు 'వికాస్ బేడీ' అని చెప్పాను. ఢిల్లీలో ప్రజలకు సక్రమంగా నీటి సరఫరా చేసే విషయంలో సాయం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు" అని ట్వీట్ చేశారు. "ఢిల్లీని కూడా దేశంతో పాటు ముందుకు తీసుకెళ్లేందుకే నేను వచ్చాను. అందుకే నా పేరును వికాస్ బేడీగా మార్చుకున్నా" అని ఒక వార్తా సంస్థతో కూడా ఆమె చెప్పారు. ప్రస్తుతం ఆమె కృష్ణ నగర్ నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో ఉన్న పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. వికాసం అంటే డెవలప్ మెంట్ అన్న సంగతి తెలిసిందే. ఆ అర్థం వచ్చేట్టుగానే బేడీ పేరు మార్చుకున్నట్టు అర్థమవుతోంది.