: తమ్ముడూ కేటీఆర్... విమర్శలు వద్దు, సాక్ష్యం ఉంటే చూపు: సబితా ఇంద్రారెడ్డి
తనపై ఉన్న సీబీఐ కేసు వ్యక్తిగతమైనది కాదని గుర్తు చేసిన మాజీ హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేసిన ఆరోపణలపై తీవ్రంగా స్పందించారు. తమ కుటుంబం 30 ఏళ్లుగా నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తోందని, తనపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించి సాక్ష్యాలేమైనా కేటీఆర్ దగ్గర ఉంటే కోర్టులో సమర్పించాలని డిమాండ్ చేశారు. "అధికారంలో ఉన్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదు బ్రదర్. అర్థంపర్థం లేకుండా వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేస్తే ఊరుకోను" అంటూ కేటీఆర్‌పై ఆమె నిప్పులు కక్కారు. వ్యక్తిగత ప్రతిష్ఠకుపోయి మాజీ మంత్రి డాక్టర్ రాజయ్యను బకరాను చేశారని సబితారెడ్డి విమర్శించారు. అంతకుముందు, రంగారెడ్డి జిల్లా పర్యటనలో భాగంగా సబితా ఇంద్రారెడ్డిపై మంత్రి కేటీఆర్ పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.