: జపాన్ పాత్రికేయుడి తల నరికిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు... కంటతడి పెట్టిన జపాన్ ప్రధాని షింజో అబే
ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్) ఉగ్రవాదులు మరోసారి తమ కర్కశత్వాన్ని చూపారు. తమ చెరలో బందీగా ఉన్న జపాన్ ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ కెంజి గొటో (47)ను తలనరికి హతమార్చినట్లు ప్రకటించారు. కెంజి గొటోకు శిరచ్ఛేదం చేస్తున్న దృశ్యాలున్న వీడియోను విడుదల చేశారు. జపాన్ ప్రభుత్వ తప్పుడు నిర్ణయాలే కెంజి మరణానికి కారణమని ఆరోపించిన ఉగ్రవాది, జపాన్ ప్రజలను వదలబోమని హెచ్చరించాడు. ముఖానికి మాస్క్ ధరించిన ఓ ఉగ్రవాది అత్యంత దారుణంగా కత్తితో కెంజీ తల నరుకుతున్న దృశ్యాన్ని చూసిన జపాన్ ప్రధాని షింజో అబే కంటతడి పెట్టారు. ఈ దారుణాన్ని ప్రపంచ దేశాలు, ఐరాస తీవ్రంగా ఖండించాయి.