: ఇక పోస్టల్ డెబిట్ కార్టులు... ఈ నెల 9న తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభం


బ్యాంకుల శాఖలు అందుబాటులో లేని గ్రామాల్లో సైతం డెబిట్ కార్డుల ద్వారా పోస్టాఫీసుల్లో నగదు లావాదేవీలు సాగించేందుకు వీలు కల్పించే ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టనున్నట్టు ఏపీ రీజియన్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బి.వి.సుధాకర్ తెలిపారు. ఇది ఏపీ, తెలంగాణలోని 108 పోస్టాఫీసుల్లో ఈ నెల 9 నుంచి అమల్లోకొస్తుందని ఆయన తెలిపారు. నిన్న కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు పోస్టాఫీసుకు వచ్చిన సందర్భంగా ఆయన ప్రజావసరాలను తీర్చేందుకు పోస్టాఫీసులు నిరంతర సేవలందిస్తాయని ప్రకటించారు. రెండు రాష్ట్రాల్లోనూ నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పేపర్ల కొరత ఉందని, వాటిని పోస్టాఫీసుల్లో అమ్మేందుకు ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News