: ఆఖర్లో అఖిల్ మెరుపులు... సీసీఎల్-5 టైటిల్ నెగ్గిన తెలుగు వారియర్స్
సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో తెలుగు వారియర్స్ విజేతలుగా అవతరించారు. ఫైనల్లో చెన్నై రైనోస్ పై 7 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. తొలుత బ్యాటింగ్ చేసిన రైనోస్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 132 పరుగులు చేయగా, మరో 11 బంతులు మిగిలుండగానే తెలుగు వారియర్స్ విజయతీరానికి చేరుకున్నారు. చివర్లో కెప్టెన్ అఖిల్ (33) మెరుపులు మెరిపించడంతో వారియర్స్ విజయం సులువైంది. జట్టులో సచిన్ జోషి (37), సుధీర్ బాబు (34) రాణించారు. హైదరాబాదు ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ కు నాగార్జున హాజరై వారియర్స్ జట్టు సభ్యులను ఉత్సాహపరచడం విశేషం.