: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 'జోకర్' హవా... టైటిల్ కైవసం


ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టైటిల్ ను సెర్బియా వీరుడు నొవాక్ జకోవిచ్ కైవసం చేసుకున్నాడు. మైదానం వెలుపల, మ్యాచ్ ల అనంతరం తన కొంటె చేష్టలతో అలరించే ఈ జోకర్ ఆదివారం జరిగిన ఫైనల్లో 7-6, 6-7, 6-3, 6-0తో బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రేను చిత్తు చేశాడు. తొలి రెండు సెట్ల పాటు హోరాహోరీగా సాగిన టైటిల్ సమరం, చివరి రెండు సెట్లలో ఏకపక్షంగా సాగింది. కీలక సమయాల్లో ముర్రే చేసిన పొరపాట్లను వరల్డ్ నెంబర్ వన్ జోకోవిచ్ తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. కాగా, జోకోవిచ్ కెరీర్లో ఇది ఐదో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ కావడం విశేషం.

  • Loading...

More Telugu News