: వరంగల్ లో కిడ్నాప్ వ్యవహారం సుఖాంతం


వరంగల్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం కలకలం రేకెత్తించిన కాంట్రాక్టర్ల కిడ్నాప్ వ్యవహారం సాయంత్రానికి సుఖాంతమైంది. పోలీసులు వెంబడించడంతో కిడ్నాపర్లు కాంట్రాక్టర్లు వెంకటేశ్వర్ రెడ్డి, శిరీష్ రెడ్డిలను వదిలి పరారయ్యారు. దుండగులు డబ్బు కోసమే కిడ్నాప్ కు పాల్పడి ఉంటారని పోలీసులు పేర్కొన్నారు. జిల్లాలోని ఖానాపురం మండలం మనుబోతులగడ్డ వద్ద రోడ్డు పనులు పర్యవేక్షిస్తున్న ఈ ఇద్దరు కాంట్రాక్టర్లను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి, కారులో తీసుకెళ్లారు. తొలుత, న్యూ డెమోక్రసీ వర్గం పనేనని అనుమానించారు. అయితే, కిడ్నాప్ తో తమకు సంబంధం లేదని న్యూ డెమోక్రసీ వరంగల్ జిల్లా కమిటీ అధ్యక్షుడు గోపన్న పేర్కొనడంతో పోలీసుల అనుమానం ఇతరులపైకి మళ్లింది.

  • Loading...

More Telugu News