: సీఎం చంద్రబాబుతో లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు పామర్ భేటీ
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ అధ్యక్షుడు బ్యారీ జె పామర్ భేటీ అయ్యారు. ఏపీలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు లయన్స్ ఇంటర్నేషనల్ సంస్థ సిద్ధంగా ఉందని పామర్ తెలిపారు. రూ.500 కోట్లతో వివిధ పథకాలు చేపడతామని ఆయన సీఎం చంద్రబాబుకు వివరించారు. ఆసుపత్రులు, రహదారి భద్రత అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని పామర్ పేర్కొన్నారు. ఏపీ డెవలప్ మెంట్ కోసం చంద్రబాబు ప్రపంచవ్యాప్తంగా సంస్థల నుంచి పెట్టుబడులను ఆశిస్తున్న సంగతి తెలిసిందే. ఆయన తన ప్రతి విదేశీ పర్యటనలోనూ పెట్టుబడులను ఆకర్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.