: వరంగల్ లో కాంట్రాక్టర్ల కిడ్నాప్ కలకలం... న్యూ డెమోక్రసీ కార్యకర్తల పనేనా?
వరంగల్ జిల్లాలో కొద్దిసేపటి క్రితం కిడ్నాప్ కలకలం రేగింది. ఖానాపూర్ మండలం మనుబోతుల గడ్డ వద్ద చోటుచేసుకున్న ఈ ఘటనలో కాంట్రాక్టర్లు వెంకటేశ్వరరెడ్డి, శిరీష్ రెడ్డిలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారు. రోడ్డు పనుల్లో నిమగ్నమైన కాంట్రాక్టర్లిద్దరినీ కారులో వచ్చిన ఆగంతుకులు బలవంతంగా కారులో ఎక్కించుకుని పారిపోయారు. నిషేధిత న్యూ డెమోక్రసీకి చెందిన కార్యకర్తలే వీరిని అపహరించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కిడ్నాపర్ల కోసం గాలింపు మొదలుపెట్టారు.