: జగన్ దీక్షకు నిరసనగా పాలకొల్లులో రైతుల ర్యాలీ... హాజరైన ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన దీక్షను నిరసిస్తూ పాలకొల్లులో రైతులు ర్యాలీ నిర్వహించారు. దాదాపు 150 గ్రామాలకు చెందిన రైతులు ఈ ర్యాలీలో పాలుపంచుకున్నారు. రైతుల దీక్షలో టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. చంద్రబాబు సర్కారు ప్రవేశపెట్టిన రుణమాఫీ పథకంపై జగన్ అసత్య ప్రచారం చేస్తున్నారంటూ ర్యాలీలో పాల్గొన్న రైతులు ఆరోపించారు. అసత్య ప్రచారం మాని జగన్ తక్షణమే దీక్ష విరమించాలని వారు డిమాండ్ చేశారు.