: రూ.25 కోట్లిస్తేనే పదవి నిలుస్తుంది... చేవెళ్ల ఎంపీకి మాజీ ఎంపీ బంధువు బెదిరింపు!


‘‘నామినేషన్‌ పత్రాల్లో ఎన్నికల సంఘానికి మీరు తప్పుడు ఆస్తులు చూపించారు. మా వద్ద సాక్ష్యాలున్నాయి. ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ.25 కోట్లు ఇవ్వండి’ అని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డికి ఈ-మెయిల్ లో బెదిరింపు వచ్చింది. ఎంపీ నుంచి ఫిర్యాదునందుకున్న సైబరాబాద్ పోలీసులు బెదిరింపులకు పాల్పడ్డ ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. ముగ్గురు నిందితుల్లో ఒకరు ఓ మాజీ ఎంపీ బంధువు ఉండడం గమనార్హం. వివరాల్లోకెళితే... జూబ్లీహిల్స్‌కు చెందిన వెంకట రమణారెడ్డి, బెంగళూరుకు చెందిన రాజేష్, కుమార్ లు ఎంపీ కొడుకు కొండా అనిధిత్‌రెడ్డికి డిసెంబర్ 8న మెయిల్ చేశారు. మీ ఆస్తుల వివరాలపై ఫిర్యాదు చేయకుండా ఉండాలంటే రూ. 25 కోట్లు ఇవ్వాలని అందులో బెదిరించారు. ఈ మెయిల్‌ను అనిధిత్‌రెడ్డి తన తండ్రికి చూపించాడు. ఈ క్రమంలో నిందితులు మరో రెండు రోజుల తర్వాత మరో మెయిల్ పెట్టారు. వరుసగా సెల్‌ఫోన్‌లో కూడా వేధించడం ప్రారంభించారు. ఇక లాభం లేదనుకున్న విశ్వేశ్వరరెడ్డి జనవరి 8న సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్‌కు ఫిర్యాదు చేశారు. కమిషనర్ ఆదేశాలతో రంగంలోకి దిగిన సైబర్‌క్రైమ్ ఇన్‌స్పెక్టర్ రియాజుద్దీన్, రూ.25 కోట్లు ఇస్తామని ముగ్గురు నిందితులను గచ్చిబౌలికి పిలిపించి అరెస్టు చేశారు.

  • Loading...

More Telugu News