: టోఫెల్ పరీక్షలోనూ మాస్ కాపీయింగ్... నలుగురు విద్యార్థులు, ఇద్దరు ఏజెంట్లు అరెస్ట్
కాదేదీ ‘కాపీ’కి అనర్హం అన్నట్టు తయారైంది పరిస్థితి. తరగతులకు గైర్హాజరు, పంతుళ్లు చెప్పిన విషయాలు బుర్రకెక్కని యువత అకడమిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు చూచిరాతలను ఆశ్రయిస్తుండటం చూశాం. ఇక ఇష్టమైన కోర్సును మంచి కళాశాలలో చదివేందుకు కొన్ని కాంపిటీటివ్ పరీక్షల్లోనూ కాపీయింగ్ జరుగుతున్న విషయమూ తెలిసిందే. తాజాగా విదేశాలకు వెళ్లేందుకు భాషా సామర్ధ్యాన్ని నిర్ధారించే పరీక్షలోనూ మాస్ కాపీయింగ్ ప్రవేశించింది. హైదరాబాదులో నిన్న జరిగిన టోఫెల్ పరీక్షలో మాస్ కాపీయింగ్ గుట్టురట్టైంది. పరీక్షలో కాపీ కొడుతున్న నలుగురు విద్యార్థులను అరెస్ట్ చేసిన పోలీసులు, ఇందుకు సహకరించిన మరో ఇద్దరు ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.