: సముద్రంపై భద్రంగా దిగినా...మునిగిన విమానం
జావా సముద్రంలో కుప్పకూలిన ఎయిర్ ఏషియా విమానం సముద్రంపై దిగేంత వరకు భద్రంగానే ఉందని 'ది మిర్రర్' పత్రిక తన కథనంలో పేర్కొంది. ఇండోనేసియా నుంచి సింగపూర్ వెళుతున్న ఎయిర్ బస్ ఎ320 జెడ్ విమానం గత డిసెంబర్ 28న జావా సముద్రంలో కుప్పకూలడంతో అందులో ఉన్న మొత్తం 162 మంది జలసమాధి అయిన విషయం తెలిసిందే. ఈ విమానం సముద్రంపై దిగేంత వరకు ఎటువంటి ప్రమాదం జరగలేదని, నీళ్లపై కొంత దూరం ప్రయాణించిన తరువాత విమానం మునిగిపోయిందని, అందువల్లే ఈఎల్ టీపై ప్రభావం పడలేదని, మిర్రర్ తన కథనంలో పేర్కొంది.