: భార్య పిలుస్తోందని పిలిచి మానభంగం చేశాడు
విజయనగరం జిల్లా రామభద్రపురంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటికి దగ్గర్లో ఉంటున్న మహిళపై ఓ మృగాడు కన్నేశాడు. దీంతో తన ఇంట్లో ఎవరూ లేని సమయం చూసుకుని, తన భార్య పిలుస్తోందని ఆమెను పిలిచాడు. నిజమే అని భావించిన బాధిత మహిళ, అతని ఇంటికి వెళ్లింది. దీనిని అవకాశంగా తీసుకున్న శ్రీను ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని శ్రీను ఈ సన్నివేశాన్ని సెల్ ఫోన్లో చిత్రీకరించి, తాను పిలిచినప్పుడల్లా రావాలని, లేని పక్షంలో సెల్ ఫోన్లో చిత్రీకరించిన దృశ్యాలు ఇతరులకు షేర్ చేయడంతో పాటు, ఇంటర్నెట్ లో పెడతానని బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన ఆమె విషం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీనిని గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను బాడంగి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తీసుకెళ్లారు. ప్రాధమిక చికిత్స అనంతరం ఆమెను విజయనగరం ప్రధానాసుపత్రికి తరలించారు. నెమ్మదిగా కోలుకుంటున్న బాధితురాలు, తనకు జరిగిన అన్యాయంపై పోలీసులు సరిగా స్పందించడం లేదని, శ్రీనుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తోంది.