: కేజ్రీవాల్ పై 10 క్రిమినల్ కేసులు: ఏడీఆర్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ముఖ్యమంత్రి అభ్యర్థి అరవింద్ కేజ్రీవాల్ పై 10 క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ఎలక్షన్ వాచ్ డాగ్ ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) తెలిపింది. అభ్యర్థుల్లో అందరికంటే ఎక్కువ క్రిమినల్ కేసులు మహియా మహల్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న షోయబ్ ఇక్బాల్ పై ఉన్నాయని వాచ్ డాగ్ ఏడీఆర్ వెల్లడించింది. కాగా, ప్రతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల క్రిమినల్ చరిత్రను వాచ్ డాగ్ ఏడీఆర్ ప్రపంచానికి పరిచయం చేస్తుంది.