: ఎంపీ గారు ఇచ్చారంటూ ఆక్రమణల్లో భూమి పూజలు చేసేశారు: దేవినేని నెహ్రూ
పార్టీకి చెందిన ఎంపీగారు ఇచ్చారని చెబుతూ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు భూమిపూజ చేసేశారని కాంగ్రెస్ నేత దేవినేని రాజశేఖర్ ఎద్దేవా చేశారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ, కృష్ణా కరకట్టపై అక్రమ కట్టడం కట్టమని చెబుతూనే సాక్షాత్తూ కేంద్ర మంత్రి భూమిపూజ చేయడం దారుణమని అన్నారు. కేంద్ర మంత్రి అండగా ఉంటారనే ధీమాతో కరకట్టపై అక్రమ కట్టడాలు కట్టుకునే సాహసం చేశారని ఆయన ఆరోపించారు.