: 250 ఎకరాల్లో అక్రమ లే అవుట్లు గుర్తించిన మంత్రి నారాయణ
గుంటూరు జిల్లా అమరావతి, తాడికొండ మండలాల్లో 131 అక్రమ లే అవుట్లు ఉన్నాయని, 250 ఎకరాల్లో నిబంధనలకు విరుద్ధంగా లే అవుట్లు వేశారని ఏపీ మంత్రి నారాయణ తెలిపారు. అమరావతి మండలంలో స్పెషల్ డ్రైవ్ నిర్వహించిన సందర్భంగా ఆయన అక్రమ లే అవుట్లను ధ్వంసం చేయాలని అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు ప్రొక్లెయిన్లతో అక్రమ లే అవుట్లను తొలగిస్తున్నారు. అనుమతులు ఉన్న లే అవుట్లలోనే క్రయవిక్రయాలు జరపాలని ప్రజలకు మంత్రి సూచించారు. రాజధాని ప్రాంతంలో 10 వేల ఎకరాల వరకు భూసమీకరణ జరిపామని ఆయన స్పష్టం చేశారు.