: కిరణ్ బేడీ కంటే షాజియా ఇల్మీ చాలా అందంగా ఉంటుంది: మార్కండేయ కట్జూ
భారతీయ ప్రెస్ కౌన్సిల్ మాజీ ఛైర్మన్ మార్కండేయ కట్జూ మరోసారి తనదైన శైలి వ్యాఖ్యలు చేశారు. దేశ రాష్ట్రపతి పదవికి బాలీవుడ్ నటి కత్రిన కైఫ్ ను కొన్ని రోజుల కిందట సూచించిన ఆయన తాజాగా అటువంటి వ్యాఖ్యలే చేశారు. బీజేపీ నేత షాజియా ఇల్మీ ఆ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కంటే చాలా అందంగా ఉంటుందన్నారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన ట్వీట్ చేశారు. ఢిల్లీ ఇల్మీ బీజేపీ సీఎం అభ్యర్థి అయితే తప్పకుండా పార్టీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. క్రొయేషియాలా (ఆగ్నేయ యూరప్ లోని ఓ దేశం) ఎన్నికల సమయంలో ప్రజలు అందంగా ఉన్న వారికే ఓటు వేస్తారని చెప్పారు. నాలా ఓటు వేయని వ్యక్తి కూడా షాజియాకే ఓటు వేస్తారని అన్నారు.