: చంద్రబాబు పోటీ చేసినా గెలుపునాదే: తలసాని


సనత్ నగర్ ఉప ఎన్నికలో తనదే విజయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. టీడీపీకి గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరగా, మంత్రి పదవి దక్కడం తెలిసిందే. అనంతరం తలసాని శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, సనత్ నగర్ నియోజకవర్గంలో చంద్రబాబు వచ్చి పోటీచేసినా తన గెలుపును అడ్డుకోలేరని అన్నారు. గ్రేటర్ హైదరాబాదులో మంచిపట్టున్న తలసాని టీఆర్ఎస్ లోకి రాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖతో పాటు వాణిజ్య పన్నుల మంత్రిత్వ శాఖను అప్పగించారు.

  • Loading...

More Telugu News