: గాంధీ ఆసుపత్రిలో నీళ్లు లేక నిలిచిపోయిన ఆపరేషన్లు


జంటనగరాల్లో పేరెన్నికగన్న గాంధీ ఆసుపత్రిలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆపరేషన్ థియేటర్లకు నీటి సరఫరా నిలిచిపోవడంతో, ఆపరేషన్లను నిలిపివేశారు. దీంతో, ఈ ఉదయం నుంచి ఒక్క శస్త్రచికిత్స కూడా జరగలేదు. ఈ ఆసుపత్రిలో రోజుకు సుమారు 50 మేజర్ ఆపరేషన్లు జరుగుతాయి. అదే సమయంలో 100కి పైగా సాధారణ శస్త్రచికిత్సలు నిర్వహిస్తారు. ఆపరేషన్ థియేటర్లకు నీటిని సరఫరా చేసే మోటార్లకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సమస్య తలెత్తింది. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ప్రస్తుతం సిబ్బంది శ్రమిస్తున్నారు.

  • Loading...

More Telugu News