: చిత్తూరు జిల్లాలో దారుణం... వేరే కులం అబ్బాయిని ప్రేమించిందని కూతుర్ని హత్య చేశారు!
ఇంటి పరువు ముందు కన్న కూతురు తక్కువగా తోచింది ఆ తల్లిదండ్రులకు. పరాయి కులస్తుడిని ప్రేమించిన కూతురిని అమానుషంగా హత్య చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లాలోని పెద్దపంజాని మండలం వీరప్పలిలో సంచలనం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, సుశీల అనే యువతి ప్రేమలో పడింది. ఈ విషయం ఇంట్లో తెలియడంతో భరించలేకపోయిన తల్లిదండ్రులు ఆ అమ్మాయి చేతులు కట్టేసి ఉరితీసి చంపారు. పది రోజుల క్రితం ఈ ఘటన జరగగా, విచారణ చేపట్టిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. దీంతో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.