: ఉత్తర, దక్షిణ భారతదేశ యాత్రల ప్యాకేజీ ప్రకటించిన రైల్వే శాఖ
యాత్రికుల సౌకర్యార్థం రెండు ప్రత్యేక ప్యాకేజీలను ప్రవేశపెట్టామని, ఐఆర్సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకోవచ్చని రైల్వే అధికారులు తెలిపారు. రామేశ్వరం - కన్యాకుమారి -నాగర్సోయిల్- మధురైలను కలుపుతూ దక్షిణాది యాత్ర, న్యూఢిల్లీ- జైపూర్- అగ్రా- మధురలను కలుపుతూ ఉత్తరాది యాత్ర ఉంటుందని తెలిపారు. ట్రైన్ రిజర్వేషన్, హోటల్ లో బస, రోడ్డు ప్రయాణం, గైడ్ తో కలిపి ప్యాకేజీని రూపొందించామని, ఐఆర్సీటీసీ ద్వారా బుక్ చేసుకున్న వారికి 5 శాతం రాయితీ ఉంటుందని వివరించారు. 5 రాత్రులు, ఆరు పగళ్ళ పాటు ఉండే హైదారాబాద్- రామేశ్వరం ప్యాకేజి టూర్ టికెట్ ధర రూ.16767 అని; 7 రాత్రులు, 8 పగళ్ళు ఉండే హైదారాబాద్- గోల్డెన్ ట్రయాంగిల్ ఆఫ్ నార్త్ ఇండియా టూర్ టికెట్ ధర రూ.20,755 అని, ఈ టూర్లు ఫిబ్రవరి 20 నుంచి ప్రారంభం అవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం http://www.irctctourism.com చూడాలని తెలిపారు.