: తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కడియం
తెలంగాణ ఉపముఖ్యమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా కడియం శ్రీహరి ఈరోజు సచివాలయంలోని తన ఛాంబర్ లో బాధ్యతలు స్వీకరించారు. అటు, పార్లమెంట్ సెక్రటరీగా వి.సతీష్ కుమార్, తెలంగాణ సాంస్కృతిక మండలి ఛైర్మన్ గా రసమయి బాలకిషన్ కూడా ఈ ఉదయం సచివాలయంలో బాధ్యతలు చేపట్టారు. వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజయ్యను బర్తరఫ్ చేసిన సీఎం కేసీఆర్ ఆయన స్థానంలో ఎంపీ కడియం శ్రీహరిని నియమించిన సంగతి తెలిసిందే.