: ‘బాబా రాందేవ్’ మందుతో మగబిడ్డ గ్యారెంటీ అట!: హర్యానాలో పూర్తిగా అమ్ముడుపోయిన మందు


యోగా గురువు బాబా రాందేవ్ పై మరోమారు వివాదం రేగింది. బాబా రాందేవ్ పతంజలి ఫార్మసీ ద్వారా లభిస్తున్న ‘దివ్య పుత్రజీవక్ సీడ్’ మందును వాడితే, మగ బిడ్డలు పుట్టడం ఖాయమేనన్న ప్రచారం దేశంలోని పలు ప్రాంతాల్లో జోరుగా సాగుతోంది. ఈ మందుతో సంతాన సమస్యలు తొలగి, పండంటి మగబిడ్డ పుడతాడని రాందేవ్ నుంచి సందేశం వచ్చిందని ఢిల్లీలోని రాందేవ్ మెడికల్ స్టోర్ లో పనిచేస్తున్న డాక్టర్ శ్యాంసుందర్ నిన్న ఎన్డీటీవీకి చెప్పారు. ఈ మందు వల్లే తమకు మగబిడ్డ పుట్టాడని కొంతమంది వ్యక్తులు ఇతరులకు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు. పతంజలి మందుల దుకాణాల ద్వారా లభించే ఈ సహజసిద్ధ ఔషధం ప్యాకెట్ ధర రూ. 35 లేనట. అయితే, ఈ మందు వల్ల మగ సంతానం కలుగుతుందన్న గ్యారెంటీ ఏమీ లేదని వైద్యులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, హర్యానాలో ఈ మందుకు ఫుల్లుగా గిరాకీ ఉందట. ఆ రాష్ట్రానికి పంపిన మందు మొత్తం ఇప్పటికే విక్రయమైపోయిందట.

  • Loading...

More Telugu News