: టీ కొట్టులోకి దూసుకెళ్లిన లారీ... మహిళ మృతి
రోడ్డుపై వెళ్లాల్సిన వాహనాలు అదుపు తప్పి జనాలపైకి దూసుకొస్తున్నాయి. ఈ తరహా ఘటనలు ఇటీవలి కాలంలో తరచూ చోటుచేసుకుంటున్నాయి. గుంటూరు జిల్లాలో ఇదే తరహాలో నేటి ఉదయం ఓ లారీ బీభత్సం సృష్టించింది. వేగంగా వస్తున్న సదరు లారీ అదుపు తప్పి రోడ్డు పక్కగా ఉన్న టీ కొట్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓ మహిళ అక్కడికక్కడే మృత్యువాతపడగా, మరో మహిళ తీవ్ర గాయాలపాలైంది. గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం బోయపాలెం వద్ద కొద్దిసేపటి క్రితం ఈ ప్రమాదం చోటుచేసుకుంది.