: సిడ్నీ కేఫ్ ఉదంతంలో తప్పెవరిది... టెర్రరిస్టుదా? పోలీసులదా?


సిడ్నీ కేఫ్ ఉదంతంలో తప్పెవరిది? అనే దానిని ఆసీస్ న్యాయస్థానం తేల్చింది. ప్రపంచ వ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఉదంతంలో పోలీసులు తొందరపడి గుడ్డిగా కాల్పులు జరపడం వల్లనే కత్రినా డాసన్ అనే ఓ బందీ మరణించారని జుడీషియల్ విచారణ స్పష్టం చేసింది. ఓ మతగురువుగా చెప్పుకొని కేఫ్‌ లో ప్రవేశించిన మోనిస్ జరిపిన కాల్పుల్లో మరణించింది కేఫ్ మేనేజర్ టోరీ జాన్స్ మాత్రమే. పోలీసులు రంగప్రవేశం చేసిన తరువాతే టెర్రరిస్టు మోనిస్ కేఫ్ మేనేజర్‌ను కాల్చి చంపాడు. పోలీసు కాల్పులకు దారి తీసిన నాటి పరిస్థితులపై నేడు న్యాయవిచారణ జరిగింది. కేఫ్ లో కాల్పులు జరపకుండా బందీలను విముక్తి చేసే అవకాశం ఉందా? లేదా? కత్రినా డాసన్ అనే టెర్రరిస్టు కాల్పుల్లోనే మరణించారా? అనే అంశాలను న్యాయస్థానం నిగ్గుతేల్చింది. పోలీసులు కాల్చిన బుల్లెట్ లేదా బుల్లెట్ల శకలాలు శరీరంలోకి దూసుకుపోవడం వల్లనే కత్రినా మరణించారని 'కరోనర్' (మరణానికి కారణాన్ని ధృవీకరించే ప్రభుత్వ న్యాయాధికారి) తేల్చారు. పోలీసుల కాల్పుల కారణంగా ఆరు బుల్లెట్ శకలాలు శరీరంలోకి దూసుకుపోవడం వల్ల కత్రినా మృతి చెందారు. కాగా, న్యాయపట్టభద్రురాలైన ఆమె (38)కు ముగ్గురు పిల్లలున్నారు.

  • Loading...

More Telugu News