: ఏపీ ఎన్జీవో భవన్ వద్ద వివాదం
రాష్ట్ర విభజన జరిగిన నాటి నుంచి ఏపీ ఎన్జీవో భవన్ వద్ద ఏదో ఒక వివాదం చోటుచేసుకుంటూనే ఉంది. ఏపీ ఎన్జీవోలు ఆంధ్రాకు వెళ్లిపోవాలని ఓ సారి వివాదం రేగితే, ఏపీ ఎన్జీవో భవన్ తమదేనంటూ మరోసారి వివాదం రేగింది. ఏపీ ఎన్జీవో భవన్ లో తమకు కూడా వాటా ఉందంటూ ఇంకోసారి వివాదం చోటుచేసుకుంది. తాజాగా ఏపీ ఎన్జీవో భవన్ వద్ద తెలంగాణ ఎన్జీవోలు బోర్డు పెట్టారు. దీంతో వివాదం రాజుకుంది. ఏపీ ఎన్జీవో భవన్ వద్ద తెలంగాణ ఎన్జీవో బోర్డు ఎలా పెడతారంటూ ఏపీ ఎన్జీవోలు అడ్డుకున్నారు. దీంతో వివాదం రాజుకుంది. ఏపీఎన్జీవోలు, టీఎన్జీవోలు ఒకరిపై ఒకరు దూషణలు, విమర్శలు చేసుకున్నారు. రాష్ట్ర విభజన తరువాత ప్రతిసారి టీఎన్జీవోలు అనవసరంగా ఘర్షణకు ప్రయత్నిస్తున్నారని ఏపీఎన్జీవోలు ఆరోపించారు.