: కివీస్ తో వన్డే ద్వారా సంగక్కర వరల్డ్ రికార్డు


శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర (37) సరికొత్త వరల్డ్ రికార్డు నమోదు చేశాడు. వన్డేల్లో అత్యధిక డిస్మిసల్స్ లో పాలుపంచుకున్న వికెట్ కీపర్ గా అవతరించాడు. ఈ క్రమంలో ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ (472 డిస్మిసల్స్) పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. వన్డే కెరీర్ లో ఇప్పటివరకు 473 మందిని అవుట్ చేయడంలో సంగా పాలుపంచుకున్నాడు. ఈ క్రమంలో 377 క్యాచ్ లు, 96 స్టంపింగ్ లు చేశాడు. కివీస్ తో ఏడో వన్డేలో కోరే ఆండర్సన్ క్యాచ్ అందుకోవడం ద్వారా సంగా ఈ ఘనత నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో సంగక్కర సెంచరీ చేయడం విశేషం.

  • Loading...

More Telugu News