: చెట్టెక్కి కూర్చున్న చిరుతను చివరికి బంధించారు!


కడప జిల్లా వీరబల్లి మండలం సానిపాయిలో ఈ ఉదయం నుంచి చెట్టుపైనే ఉన్న చిరుతపులిని ఎట్టకేలకు బంధించారు. చిరుత గురించి సమాచారం అందుకున్న అటవీశాఖ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. సుమారు 7 గంటల పాటు శ్రమించి, ఎన్నో ప్రయత్నాల అనంతరం దానికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి బోనులోకి చేర్చారు. దానిని తిరుపతి జూపార్కుకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News