: ఢిల్లీలో బీజేపీ ఎన్నికల మేనిఫెస్టో ఉండదు: అనంత కుమార్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఉండదని బీజేపీ నేత, కేంద్రమంత్రి అనంత కుమార్ తెలిపారు. ఢిల్లీ అభివృద్ధికి రూపొందించిన ఓ విజన్ డాక్యుమెంటును ప్రకటిస్తామని చెప్పారు. దాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ, పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ విడుదల చేస్తారని మీడియాకు వెల్లడించారు. ఫిబ్రవరి 7న ఢిల్లీలో పోలింగ్ జరగనుంది. ఎన్నికల్లో ఎలాగైనా విజయాన్ని చేజిక్కించుకోవాలని, ప్రభుత్వం ఏర్పాటు చేయాలని బీజేపీ ఉవ్విళ్లూరుతోంది. అటు, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రెండోసారి అధికారం దక్కించుకోవాలని తీవ్రంగా శ్రమిస్తోంది.

  • Loading...

More Telugu News